-->

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి


మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని రాంపూర్ సమీపంలో 765డి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నర్సాపూర్ నుంచి బైక్‌పై మెదక్ వైపు వెళ్తున్న వారిని మెదక్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్ (51), ఆయన కుమారుడు రిషివర్ధన్ గౌడ్ (13), అల్లుడు బొగడ సాయ గౌడ్ (32) అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న కొల్చారం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనతో బూర్గుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793