-->

నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల బహుకరణ – చెక్కుల పంపిణి

నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల బహుకరణ – చెక్కుల పంపిణి


పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యత పత్రాల ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్. కిషోర్ రెడ్డి, చైర్మన్, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, పోచంపల్లి (యాదాద్రి భువనగిరి జిల్లా) హాజరయ్యారు. కేంద్రంలో నిర్వహించిన బ్యూటీషన్, టైలరింగ్, ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆయన చేతుల మీదుగా యోగ్యత పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా బ్యూటీషన్ కోర్సులో శిక్షణ పొందిన ఆర్. నందిని మాట్లాడుతూ, నవ మహిళా సాధికార కేంద్రం తమలాంటి మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అతిథుల చేతుల మీదుగా బ్యూటీషన్, టైలరింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఆఫీస్ ఆటోమేషన్ కోర్సుల యోగ్యత పత్రాలతో పాటు దుస్తుల తయారీ, తాటాకుల బుట్టల తయారీ ద్వారా వచ్చిన రూ.1,07,641 నగదు చెక్కులు కూడా పంపిణి చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎన్. కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి నవ సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

అనంతరం మహిళా సాధికార కేంద్ర ప్రతినిధి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ కేంద్రంలో ఇప్పటివరకు 4600 మందికి పైగా మహిళలు వివిధ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేశారని, అందులో 75 శాతం మహిళలు ఇంటి వద్దే టైలరింగ్, బ్యూటీషన్ పనులు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారని, మరికొందరు స్వంత వ్యాపారాలు ప్రారంభించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్. వెంకటేశ్వర్లు (రిటైర్డ్ హెడ్ మాస్టర్), ఏ. శ్రీనివాస్ రెడ్డి, డి.జి.ఎం (హెచ్‌ఆర్ & ఏ), ఆముద, టి. అరుణ, బి. అరుణ, కవిత, దివ్య, శిరీష, రాజేశ్వరావు, రాజేష్ తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793