డిజిటల్ అరెస్ట్ పేరుతో 82 ఏళ్ల వృద్ధుడిని మోసం – రూ.72 లక్షలు దోపిడీ
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని వక్రీకరించి మోసగాళ్లు ప్రజలను ఎలా బలితీసుకుంటున్నారనడానికి మరో ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
నగరానికి చెందిన 82 ఏళ్ల వృద్ధుడిని నిందితులు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా టార్గెట్ చేశారు. తాము ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. ఆయన ఆధార్ కార్డు మనీ లాండరింగ్ కేసులో లింక్ అయ్యిందని భయపెట్టారు.
దీనితో వృద్ధుడిని పది రోజుల పాటు “డిజిటల్ అరెస్ట్” పేరుతో కట్టడి చేశారు. ఈ కాలంలో అతనిపై ఒత్తిడి తీసుకొచ్చి రూ.72 లక్షలు దోచుకున్నారు.
తరువాత తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post a Comment