-->

బెల్లంపల్లిలో పెళ్లి సంబంధం పేరుతో చోరీ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాళ్లగురిజాలలో కొత్త తరహా చోరీ వెలుగుచూసింది.


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాళ్లగురిజాలలో కొత్త తరహా చోరీ వెలుగుచూసింది. పుల్లగొర్ల పుష్పలత అనే మహిళ తాను పెండ్లి సంబంధాలు చూస్తానని చెబుతూ ప్రజలను నమ్మించింది. తాళ్లగురిజాలకు చెందిన ఇందూరి చంద్రశేఖర్ తన తమ్ముడు మహేందర్‌కు సంబంధం చూపించమని ఆమెను కోరాడు. దీనికి పుష్పలత అంగీకరించింది.

🗓️ ఈ నెల 22న ఉదయం చంద్రశేఖర్‌కి ఫోన్ చేసి, “మీ తమ్ముడికి మంచిర్యాలలో సంబంధం చూశాను, మీరంతా కుటుంబ సభ్యులతో రావాలి” అని చెప్పింది.

🔹 కుటుంబం అంతా మంచిర్యాలకు వెళ్లగానే, పుష్పలత మాత్రం చంద్రశేఖర్ ఇంటికి చేరింది.
🔹 ఇంట్లో ఉన్న చిన్నపాపను కిరాణా షాప్‌కి పంపి, తాళం పగలగొట్టి బీరువా లాక్‌ను ఐరన్ రాడ్‌తో విరిచింది.
🔹 అందులో ఉన్న బంగారు నెక్లెస్, రూ.15,000 నగదు అపహరించి వెళ్లిపోయింది.

📍 తరువాత గొల్లగూడ కన్నాలలోని తన ఇంటికి చేరిన పుష్పలత, ఆదివారం ఉదయం బెల్లంపల్లిలో బంగారు నెక్లెస్ అమ్మేందుకు వెళ్తుండగా తాళ్లగురిజాల ఎస్ఐ రామకృష్ణ, ఏఎస్ఐ బాబాజీ, కానిస్టేబుల్ తిరుమల ఆమెను పట్టుకున్నారు. నిందితురాలు పుష్పలత వద్ద నుండి బంగారు నెక్లెస్, రూ.15,000 స్వాధీనం చేసి అరెస్ట్ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793