తూప్రాన్‌లో ముస్లింలతో సీఐ రంగకృష్ణ సమావేశం
మెదక్ జిల్లా తూప్రాన్‌లో సీఐ రంగకృష్ణ ముస్లిం మైనారిటీ సోదరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే మిలాద్-ఉన్-నబీ పండుగ వేడుకల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ రంగకృష్ణ మాట్లాడుతూ, అదే సమయంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కూడా జరగనుండటంతో రెండు పండుగలు శాంతియుతంగా, సమన్వయంతో సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులకు సెప్టెంబర్ 14న మిలాద్-ఉన్-నబీ పండుగ జరుపుకోవాలని వినయపూర్వకంగా తెలియజేశారు.
ముస్లిం సోదరులు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు సమాజాల వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌహార్ద వాతావరణంలో జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు సీఐ రంగకృష్ణ స్పష్టం చేశారు.
Post a Comment