-->

అల్లు అరవింద్ తల్లి, రామలింగయ్య సతీమణి కనకరత్నం కన్నుమూత

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, రామలింగయ్య సతీమణి కనకరత్నం కన్నుమూత


హైదరాబాద్, ఆగస్టు 30: తెలుగు సినీ పరిశ్రమలో శోకసంద్రం నెలకొంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నం (94)  ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం కన్నుమూశారు. ఈ వార్త తెలిసి సినీ, రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

విషయం తెలిసిన వెంటనే హీరో అల్లు అర్జున్ ముంబై నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. కనకరత్నం గారి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయి.

ఆమె మృతితో అల్లు కుటుంబం మాత్రమే కాకుండా తెలుగు సినీ రంగం మొత్తానికీ తీరని లోటు ఏర్పడిందని పలువురు భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793