సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత
హైదరాబాద్: బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో కవిత రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.
👉 బీఆర్‌ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అంశంపై కవిత ఆలోచనలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
👉 త్వరలోనే మీడియా ఎదుట కవిత స్వయంగా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
👉 పార్టీపై విమర్శనాత్మక ధోరణి, వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారిన కవితపై వేటు పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కవిత భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఎటు దిశగా సాగుతుందనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.
Post a Comment