-->

ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేసి ఉద్యోగులను బెదిరింపులకు ఘటన వెలుగులోకి

ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేసి ఉద్యోగులను బెదిరింపులకు ఘటన వెలుగులోకి


హైదరాబాద్: ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ నంబర్ 9154893428 నుంచి కాల్స్ చేస్తూ, "కేసులు పెట్టం, డబ్బులు ఇవ్వండి" అంటూ కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒక ఫిర్యాదు ఈ రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైంది.

ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ స్పష్టంచేశారు. "ఏసీబీ అధికారులు ఎప్పుడూ డబ్బులు అడగరు, కేసులు నమోదు చేయకుండా డబ్బులు ఇవ్వాలని కోరరు. అలాంటి తప్పుడు కాల్స్‌ను ఎవ్వరూ నమ్మవద్దు, చెల్లింపులు చేయవద్దు" అని హెచ్చరించారు.

ఇలాంటి నకిలీ కాల్స్ అందిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని, స్థానిక పోలీస్ స్టేషన్లను కూడా అప్రమత్తం చేయాలని ఏసీబీ సూచించింది.

అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చు:

  • WhatsApp: 9440446106
  • Facebook: Telangana ACB
  • X (Twitter): @TelanganaACB

ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి అని అధికారులు హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793