గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనపై పోలీసుల అవగాహన సదస్సు
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని విరోచవరం, ధర్మారం గ్రామాలలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన, మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంథని ఎస్సై డేగ రమేష్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు.
అలాగే, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగు, అక్రమ రవాణా లేదా సరఫరాకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లేశం, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ నాయక్, కానిస్టేబుల్ అజయ్, హోంగార్డు వెంకటేష్‌తో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

Post a Comment