ఇంటర్ విద్యార్థి హత్యకు గురైన ఘటన కలకలం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శనివారం రాత్రి ఓ ఇంటర్ విద్యార్థి హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ శివార్లలో ఈ దారుణం చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారంతో వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు మాధగోని ఈశ్వర్ (18). ఇతడు మాధగోని సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమారుడు. మిర్యాలగూడలోని ఒక కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
శనివారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన ఈశ్వర్, కాలనీ శివార్లలో తీవ్ర గాయాలతో మృతిచెందిన స్థితిలో లభ్యమయ్యాడు. ముఖ్యంగా మెడ భాగంలో లోతైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈశ్వర్ మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సిఐ మోతీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు క్లూస్ టీంతో పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలు బయటపడాల్సి ఉంది.

Post a Comment