కానిస్టేబుల్ హరిప్రసాద్ (PC-3559) దురదృష్టవశాత్తు మృతి
కానిస్టేబుల్ హరిప్రసాద్ దుర్మరణం
మహబూబాబాద్ జిల్లా: నర్సింహాలపేటకు చెందిన కానిస్టేబుల్ హరిప్రసాద్ (PC-3559) దురదృష్టవశాత్తు మృతిచెందారు. ప్రస్తుతం తొర్రూర్ సర్కిల్ ఆఫీసులో అటాచ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆదివారం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదానికి గురయ్యారు.
సమాచారం ప్రకారం, హరిప్రసాద్ గూడ్స్ రైలు కింద నుంచి దాటుతున్న సమయంలోనే రైలు కదలడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటనతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో విషాదం నెలకొంది. సహచర పోలీసు సిబ్బంది, స్థానికులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషాద సంఘటనపై పోలీస్ విభాగంలో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
Post a Comment