-->

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో విషాదం ఒక వ్యక్తి గల్లంతైన ఘటన

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో విషాదం ఒక వ్యక్తి గల్లంతైన ఘటన


నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో శనివారం ఒక వ్యక్తి గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్ప గంగాధర్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లగా, అకస్మాత్తుగా నీటి ఉధృతికి చిక్కుకుని ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గంగాధర్ కోసం ముమ్మరంగా శోధన కొనసాగుతోంది.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు.

Blogger ఆధారితం.