-->

తెలంగాణలో వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం

తెలంగాణలో వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం


తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పబోతోంది. రాష్ట్రంలో రేషన్ పంపిణీని సెప్టెంబర్ నెల నుంచి పునఃప్రారంభించనున్నారు. మూడు నెలల రేషన్‌ను ముందుగానే పంపిణీ చేసిన కారణంగా ఆగస్టు వరకు రేషన్ డిపోల్లో సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ నుండి మళ్లీ బియ్యం పంపిణీ మొదలవుతుంది.

ఈసారి రేషన్ తీసుకునే వారికి ప్రత్యేక బహుమతిగా ఉచితంగా రేషన్ బ్యాగులు అందించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ బ్యాగుల్లో సన్న బియ్యం నింపి ఇస్తారు. బయట మార్కెట్‌లో రూ.50 వరకు విలువ చేసే ఈ బ్యాగులు పూర్తిగా ఉచితంగానే రేషన్ కార్డుదారులకు అందజేస్తారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కూడా ఈ బ్యాగులపై ముద్రించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉంటాయి. అలాగే ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో ఆరు గ్యారంటీల వివరాలను కూడా ఈ బ్యాగులపై స్పష్టంగా ముద్రించారు.

రాష్ట్రంలోని అన్ని రేషన్ డిపోలకు ఈ ప్రత్యేక బ్యాగులు ఇప్పటికే చేరాయని అధికారులు తెలిపారు. దీంతో రాబోయే నెల నుండి రేషన్ బియ్యంతో పాటు ఉచిత బ్యాగులు కూడా లభ్యమవనున్నాయి.

Blogger ఆధారితం.