తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిగా ఎండి ముస్తఫా
తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిగా ఎండి ముస్తఫా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర జాగృతి మైనారిటీ అధ్యక్షులుగా నియమితులైన ఎండి ముస్తఫాను అంజయ్య యాదవ్ అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఆయన మరింత ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. యువతకు మార్గదర్శకుడిగా, మైనారిటీల అభివృద్ధి కోసం ముస్తఫా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మాజీ కన్వీనర్ బాలాజీ ఉదయ్, జాగృతి సీనియర్ నాయకులు సునీల్ రెడ్డి, శ్రీను నాయక్, రమేష్, సయ్యద్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment