రోడ్డు మీద కూర్చొని భోజనం చేసిన ఎస్ఐ
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో ఓ అరుదైన దృశ్యం కనబడింది. రాత్రి కురిసిన భారీ వర్షంతో గంగారం మండల కేంద్రం సమీపంలో కొత్తగూడ వెళ్ళు రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన గంగారం ఎస్సై రవికుమార్ వెంటనే సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
గుంతలను సరిచేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా మార్గం సుగమం చేసిన అనంతరం, పనిలో సహాయం చేసిన తన మిత్రులతో కలిసి రోడ్డుపై కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని ఎస్సై రవికుమార్ అన్నారు. రోడ్డు మీద కూర్చొని అన్నం తిన్న ఆ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది.
Post a Comment