అశ్వరావుపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
చండ్రుగొండ, అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభ విజయవంతం కావడానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ కోహిత్ రాజు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు కలిసి సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు ఉండేలా అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సభలో భారీగా ప్రజలు హాజరై సీఎం పర్యటన విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి.
Post a Comment