-->

పబ్జీ గేమ్‌కు బానిసైన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

పబ్జీ గేమ్‌కు బానిసైన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య


నిర్మల్ జిల్లా, భైంసా: పబ్జీ గేమ్‌కు బానిసైన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. భైంసా పట్టణానికి చెందిన బేతి రిశేంద్ర (10వ తరగతి విద్యార్థి) ప్రతిరోజూ పది గంటలకు పైగా పబ్జీ గేమ్ ఆడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

గేమ్‌కు అంతలా అలవాటు పడి చదువులపై ఆసక్తి కోల్పోయిన రిశేంద్ర, పదో తరగతిలో చేరడానికి కూడా నిరాకరించాడని తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్‌, న్యూరోసర్జన్‌లకు చూపించినా అతను గేమ్ ఆడుతానని పట్టుబట్టడమే కాకుండా వారినే బెదిరించాడని సమాచారం.

మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు ఫోన్ లాక్కోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రిశేంద్ర, ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో భైంసా ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

🔹 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793