-->

రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్‌లో బంగారు పతకం గెలిచిన ‘సింబా’కు సీపీ అభినందనలు

రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్‌లో బంగారు పతకం గెలిచిన ‘సింబా’కు సీపీ అభినందనలు


రామగుండం పోలీస్ కమిషనరేట్, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన నార్కోటిక్ డాగ్ "సింబా" గొప్ప విజయాన్ని అందుకుంది. వరంగల్ జిల్లా మమునూరు పిటిసిలో ఇటీవల నిర్వహించిన రెండవ రాష్ట్ర డ్యూటీ మీట్‌లో కాళేశ్వరం జోన్ తరఫున పోటీలో పాల్గొన్న సింబా, గంజాయి, మత్తుపదార్థాల గుర్తింపు విభాగంలో తన ప్రతిభను చాటింది.

డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వేణుగోపాల్ కృష్ణ సారథ్యంలో పాల్గొన్న ఈ జంట బంగారు పతకం (గోల్డ్ మెడల్) సాధించింది. అంతేకాక, రాష్ట్రస్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్‌గా సింబా ఎంపిక కావడం గర్వకారణం.

ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ తన కార్యాలయంలో సింబా మరియు హ్యాండ్లర్‌ను అభినందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని పూణేలో జరగబోయే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనాలని, అక్కడ కూడా పతకాలు సాధించి రాష్ట్రమాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌కి ఖ్యాతి తీసుకురావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ పి. కరుణాకర్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలుగా దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, సంపత్, మల్లేశం తదితర అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.