జెన్కో యాజమాన్యంతో 1104 యూనియన్ జాయింట్ మీటింగ్
హైదరాబాద్: జెన్కో యాజమాన్యంతో 1104 యూనియన్ జాయింట్ మీటింగ్ మంగళవారం నిర్వహించబడింది. ఈ సమావేశానికి CMD/TGGENCO హరీష్, డైరెక్టర్ (హెచ్‌ఆర్) ఎస్.వి. కుమార్ రాజు, CGM (ADM) రాజేంద్రప్రసాద్, DS పద్మావతి తదితర అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలపై సుమారు గంటన్నర పాటు చర్చలు జరిగాయి.
🔴 CMD స్పందన:
- ఆర్టిజన్ సమస్యల (సెలవులు, గ్రేడ్ మార్పులు, సర్వీస్ రూల్స్, మెడికల్ ఇన్వాల్యుడేషన్, గ్రాట్యూటీ తదితర అంశాలు) పరిష్కారం కోసం ఇతర CMDలతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- ఉద్యోగి మరణించిన వెంటనే – గరిష్టంగా నెల రోజుల్లోపు డిపెండెంట్‌కు ఉద్యోగ ఆర్డర్ ఇవ్వడం సంస్థ బాధ్యతగా పేర్కొన్నారు.
- బీటెక్, డిప్లమా ఉద్యోగులకు సబ్ ఇంజనీర్ అవకాశాలు కల్పించేందుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
- ప్రతినెలా ఒకటో తేదీకల్లా జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ఈ నెల జీతాలు నేడు ఉద్యోగులకు అందుతాయని వెల్లడించారు.
- సీనియర్ గ్రేడ్ ఫోర్‌మెన్ పోస్టుల విషయంలో ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
- 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 30 వరకు చేరిన ఉద్యోగుల EPF ఖాతాలను GPFగా మార్చి పెన్షన్ సదుపాయం కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
- జేపీఏ–జూనియర్ అసిస్టెంట్ కన్వర్షన్ స్క్రీనింగ్ టెస్ట్ త్వరలో నిర్వహిస్తామని వెల్లడించారు.
అదేవిధంగా, హైడల్ మరియు థర్మల్ స్టేషన్లలో ఉన్న 40 సమస్యలను కూడా యాజమాన్యం ముందు ప్రస్తావించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. రాజేందర్, అదనపు జనరల్ సెక్రటరీ జి. వరప్రసాద్, సలహాదారులు ఆర్. జనార్ధన్ రెడ్డి, జెన్కో అధ్యక్షుడు కె. కోటేశ్వరరావు, కార్యదర్శి వి. దుర్గ అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. యాసయ్య, అదనపు కార్యదర్శి ఏ. కుశలవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment