దాహం వేసినప్పుడు మనం ఎక్కడైనా వెంటనే నీటి బాటిల్‌ను కొనుక్కుంటాం. చల్లని నీరు తాగి దాహాన్ని తీర్చుకుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆ బాటిల్ మూత రంగును గమనించారా? నీలం, తెలుపు, ఆకుపచ్చ, పసుపు, నలుపు… ప్రతి రంగుకూ ఒక ప్రత్యేక అర్థం ఉందని చాలా మందికి తెలియదు. కేవలం డిజైన్ కోసం మాత్రమే కాదు, మూత రంగు ద్వారా బాటిల్‌లో ఉన్న నీటి రకం, మూలం, గుణాత్మకత గురించి కూడా తెలుసుకోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మూత రంగు వెనుక అసలు ఉద్దేశం
ప్రమాదకరమైన నీటిని తాగకుండా వినియోగదారులు సులభంగా గుర్తించేందుకు, అలాగే మార్కెట్లో వేర్వేరు రకాల నీటిని వేరు చేయడానికి కొన్ని బ్రాండ్లు ఈ రంగులను వాడుతున్నాయి. అధికారికంగా ఇది తప్పనిసరి నియమం కాకపోయినా, చాలా చోట్ల ఒక పద్ధతిగా మారింది.
🔹 నీలం మూత
మార్కెట్‌లో అత్యధికంగా కనిపించే మూత ఇదే. నీలం రంగు అంటే మినరల్ వాటర్ అని అర్థం. నేరుగా సహజ వనరుల నుంచి సేకరించి శుద్ధి చేసిన నీటిని ఇందులో నింపుతారు. ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు.
⚪ తెలుపు మూత
తెలుపు రంగు మూత ఉన్న బాటిల్స్‌లోని నీరు యంత్రాల ద్వారా శుద్ధి చేయబడుతుంది. అంటే RO ప్లాంట్ లేదా ఫిల్టర్ మెషిన్ ద్వారా శుద్ధి చేసిన నీరు. ఇది కూడా సురక్షితమే, తాగడానికి అనువైనదే.
⚫ నలుపు మూత
మార్కెట్‌లో అరుదుగా కనిపించే బాటిల్స్ ఇవి. వీటిని ఆల్కలైన్ వాటర్ అంటారు. ప్రత్యేక పద్ధతిలో శుద్ధి చేసిన ఈ నీటిలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎక్కువగా సెలబ్రిటీలు, క్రీడాకారులు ఉపయోగిస్తారు. ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
🟡 పసుపు మూత
పసుపు రంగు మూత ఉన్న నీటి బాటిల్స్‌లో విటమిన్లు, ఎలక్ట్రోలైట్లు కలిపి ఉంటాయి. శరీరానికి శక్తినివ్వడం, అలసట పోగొట్టడం వీటి ముఖ్య ఉద్దేశ్యం. వేసవి కాలంలో ఇవి ఎక్కువ డిమాండ్‌లో ఉంటాయి.
🟢 ఆకుపచ్చ మూత
ఆకుపచ్చ రంగు మూత సహజ నీటికి సంకేతం. వనరుల నుంచి నేరుగా సేకరించి, సహజత్వాన్ని కాపాడుతూ శుద్ధి చేసిన నీటిని ఇందులో నింపుతారు. నేచురల్ వాటర్ ఇష్టపడేవారు ఎక్కువగా ఈ రకాన్ని ఎంచుకుంటారు.
చివరగా…
బాటిల్ కొనేటప్పుడు ఎక్కువగా మనం ధర, చల్లదనం, బ్రాండ్‌నే మాత్రమే చూస్తాం. కానీ ఇకపై మూత రంగును కూడా గమనించండి. మీ ఆరోగ్యానికి, అవసరాలకు తగ్గట్టుగా సరైన నీటిని ఎంచుకోవడానికి ఇది చిన్న మార్గదర్శకం అవుతుంది.
Post a Comment