లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి అరెస్ట్
మన్చిర్యాల జిల్లాలో లంచం కేసు.. పంచాయతీ కార్యదర్శి అరెస్ట్, మన్చిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకట స్వామి లంచం తీసుకుంటూ అనిశా (ACB) అధికారుల చేతికి పట్టుబడ్డారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఫిర్యాదుదారునికి రూ.1,00,000/- మంజూరు కావాల్సి ఉండగా, బేస్మెంట్ ఫోటోలు తీసి, ఇంటి నిర్మాణ దశల వారీగా పురోగతిని యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి సహాయం చేస్తానని చెప్పి రూ.20,000/- లంచం డిమాండ్ చేసిన కార్యదర్శిని, డబ్బులు స్వీకరిస్తూ అక్కసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ప్రజలకు అవగాహన:
👉 ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేయవచ్చు.
👉 అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), లేదా acb.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
👉 ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
Post a Comment