తెలంగాణ ఆడబిడ్డలకు రేవంతన్న కానుకగా “ఇందిరమ్మ చీరలు” పంపిణీ
హైదరాబాద్: ప్రజల పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కానుకను ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు నాణ్యమైన ఇందిరమ్మ చీరలు అందజేయనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత ప్రభుత్వంలా నాసిరకం చీరలు కాకుండా, ఒక్కో చీర విలువ రూ.800 ఉండేలా అత్యుత్తమ నాణ్యతతో సిద్ధం చేసిన ఈ చీరలను ఇందిరా మహిళా శక్తి పథకం కింద పంపిణీ చేయనున్నారు.
సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 6,000 మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి లభించడంతో పాటు, తెలంగాణ చేనేత రంగానికి బలమైన ఊతం లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
పండుగ సీజన్ ముందు ఈ పథకం ప్రారంభమవుతుండటంతో, రాష్ట్రంలోని మహిళల కళ్లల్లో ఆనందం మెరవనుందనే చెప్పాలి.
Post a Comment