కామారెడ్డి జిల్లా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
కామారెడ్డి జిల్లా బుడిగిడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న పొలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, నష్టాలను తెలుసుకున్నారు.
పంట నష్టం, ఆస్తి నష్టంపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయని రైతులు వివరించగా, వాటిని తొలగించి తిరిగి వ్యవసాయ యోగ్యంగా భూములను తయారు చేయించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.
ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన ప్రతి రైతు పక్కన ప్రభుత్వం నిలబడుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
Post a Comment