-->

గవర్నమెంట్ ఖాజీ రషీద్ ఖాన్‌పై వేటు – పదవి నుండి తొలగింపు

 

గవర్నమెంట్ ఖాజీ రషీద్ ఖాన్‌పై వేటు – పదవి నుండి తొలగింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ASJ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ కరీం, ఉపాధ్యక్షులు మొహమ్మద్ గౌస్, అబ్దుల్ రజాక్, అమీర్ అహ్మద్ మాట్లాడుతూ –

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ శాఖ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (జి.ఓ. నెం:72, తేది: 22-08-2025) ప్రకారం, కొత్తగూడెం మరియు పరిసర 7 మండలాలకు గవర్నమెంట్ ఖాజీగా వ్యవహరిస్తున్న మొహమ్మద్ అబ్దుల్ రషీద్ ఖాన్ ను పదవి నుండి తొలగించినట్లు వెల్లడించారు.

రషీద్ ఖాన్ అనుచిత ప్రవర్తన, చట్టవిరుద్ధ చర్యలపై స్థానిక నాయకుడు అమీర్ అహ్మద్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆరోపణలు రుజువైనట్లు తెలిపారు. దీనితో మైనారిటీ వెల్ఫేర్ శాఖ అతడిని ఖాజీ పదవి నుండి తొలగించిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో, రషీద్ ఖాన్ ఇకపై శుభకార్యాలు నిర్వహించడం, కుటుంబ వివాదాల పరిష్కారం చేయడం లేదా మస్జిద్ ఇమామ్‌గా వ్యవహరించడం వంటి ఎటువంటి హక్కు లేదా అధికారం లేకుండా పోయిందని ముస్లిం సమాజానికి స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో మహమ్మద్ గౌస్, అబ్దుల్ రజాక్, అమీర్ అహ్మద్, షమీ, ఇబ్రహీం, ఎండి హుస్సేన్, ఎండి దావూద్, ఎస్కె నయీమ్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793