ప్రపంచవ్యాప్తంగా నేడు సంపూర్ణ చంద్రగ్రహణం
హైదరాబాద్: సెప్టెంబర్ 07: ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో సుమారు 85% మందికి ఈ గ్రహణం ప్రత్యక్షమవనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణంగా కనిపించగా, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షిక గ్రహణం దర్శనమివ్వనుంది. చంద్రుడు మొత్తం 82 నిమిషాల పాటు భూమి నీడలో ఉండనున్నాడు.
ఈ సంపూర్ణ చంద్రగ్రహణం నేడు మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమై రాత్రి 1:26 గంటలకు ముగియనుంది. శతభిష, పూర్వభాద్ర నక్షత్ర సంధి కాలంలో ఇది సంభవిస్తున్నందున పండితులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
📿 ఆలయాల మూసివేతలు:
- ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం: మహా నివేదన అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మూసివేత, రేపు ఉదయం 5 గంటలకు శుద్ధి, హోమాలు అనంతరం ఉదయం 9:30కి భక్తులకు దర్శన అనుమతి.
- వేములవాడ రాజన్న ఆలయం: ఉదయం 11:25 గంటలకు మూసివేత, సోమవారం ఉదయం 3:45 వరకు కొనసాగుతుంది. అనంతరం శుద్ధి, సంప్రోక్షణల అనంతరం దర్శన ప్రారంభం.
- శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం: నేడు మధ్యాహ్నం 12 గంటలకు ద్వారబంధనం, రేపు ఉదయం 7:30 గంటలకు శుద్ధి అనంతరం దర్శన ప్రారంభం.
- వరంగల్ భద్రకాళి ఆలయం: ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేత, రేపు ఉదయం 6 గంటలకు శుద్ధి పూర్తి చేసి, 7 గంటలకు భక్తులకు దర్శన అనుమతి.
👉 ఈ రెండు రోజుల పాటు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

Post a Comment