-->

మిలాద్ – ఉన్ – నబీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

మిలాద్ – ఉన్ – నబీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 05: మిలాద్ – ఉన్ – నబీ పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ప్రవక్త ముహమ్మద్ మానవాళికి చూపిన జీవన మార్గం శాంతి, ప్రేమ, సహనం, త్యాగం, సేవతో నిండినది. ఆయన బోధనలు నేటికీ సమాజాన్ని సత్యం, న్యాయం, సౌభ్రాతృత్వం వైపు దారితీస్తున్నాయి. ముస్లిం సోదర సోదరీమణులకే కాక మానవాళికే ఈ విలువలు మార్గదర్శకం.

ప్రవక్త జన్మదినమైన మిలాద్ – ఉన్ – నబీ ముస్లింలకు పవిత్రమైన రోజు. ఈ పవిత్ర దినోత్సవం అందరికీ మానవతా విలువలను ఆచరించే స్ఫూర్తిని కలిగించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సమాజ అభ్యున్నతికి కట్టుబడి ఉంది.

ఈ పర్వదినాన్ని శాంతి, సౌభ్రాతృత్వం, ఆనంద వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.” – ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793