💥కోట్లలో పలికిన బండ్లగూడ గణపతి లడ్డు💥
హైదరాబాద్: సెప్టెంబర్ 06: వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గణనాధుని ఆశీస్సులు పొందిన ఆ మహా ప్రసాదాన్ని పొందితే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఎంతైనా వెచ్చించి లడ్డూను సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ బండ్లగూడ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో శుక్రవారం రాత్రి జరిగిన లడ్డూ వేలం చరిత్ర సృష్టించింది. ఎవరూ ఊహించని రీతిలో లడ్డూ రూ.2 కోట్ల 31 లక్షల 95 వేలు పలికింది.
ఈ భారీ మొత్తాన్ని వెచ్చించి భక్తులు లడ్డూను దక్కించుకోవడంతో గత ఏడాది నమోదైన రూ.1.87 కోట్ల రికార్డు బద్దలైంది.
ఇక బాలాపూర్ లడ్డూ వేలంపాట కూడా ఇప్పటికే ప్రారంభమైంది. వినాయక చవితి ఉత్సవాల్లో అత్యంత ఆసక్తికరమైన ఈ సంఘటనపై అందరి దృష్టి నిలిచింది. ఈసారి బాలాపూర్ లడ్డూ ఏ రికార్డును సృష్టిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. గతేడాది సెప్టెంబర్ 17న జరిగిన వేలంలో బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.30.01 లక్షలకు అమ్ముడైన సంగతి తెలిసిందే.
Post a Comment