-->

సీఎం రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసారు

 

సీఎం రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసారు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు రాజకీయ, ఆర్గనైజేషన్ సంబంధిత అంశాలపై చర్చించినట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటితో ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలవగా, ముఖ్యమంత్రి ఆయనను అభినందించారు.

ఇక మరోవైపు, ఈ నెల 8వ తేదీన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్‌లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్ కోఆర్డినేటర్లు, జిల్లా కమిటీ కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొననున్నారు.

➡️ ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793