సైబర్ మోసం ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్‌తో యువకుడికి రూ.70 వేల నష్టం..
రాజన్న సిరిసిల్ల జిల్లా – ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం
ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్‌తో యువకుడికి రూ.70 వేల నష్టం..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ ఫోటో ఎడిట్ యాప్ “జెమినీ” డౌన్‌లోడ్ చేసి, అందులో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. కొద్దిసేపటికే అతని బ్యాంక్ ఖాతా నుండి రూ.70,000 మాయం కావడంతో షాక్‌కు గురయ్యాడు.
తక్షణమే బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హెచ్చరిక:
పోలీసులు ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు.
- అపరిచిత యాప్‌లలో వ్యక్తిగత ఫోటోలు, ఆధార్, బ్యాంక్ డిటైల్స్ ఇవ్వకూడదు.
- అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకూడదు.
- డబ్బులు పోయిన సందర్భంలో వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Post a Comment