-->

హెచ్.ఎం.ఎస్ జాతీయ కార్యదర్శిగా ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్

హెచ్.ఎం.ఎస్ జాతీయ కార్యదర్శిగా ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్


శ్రీరాంపూర్, అఖిల భారత సింగరేణి మైనర్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్.ఎం.ఎస్ 26వ ద్వైపాక్షిక మహాసభలో ఆర్జీ-3 ఏరియా హెచ్.ఎం.ఎస్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీగా పనిచేస్తున్న ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీని జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

ఇస్మాయిల్ ఎన్నుకోబడిన విషయంపై రామగుండం రీజియన్‌తో పాటు సింగరేణి పరిధిలోని 12 డివిజన్లలో సంబరాలు జరిగాయి. యూనియన్ కార్యకలాపాల పట్ల ఆయన చూపిస్తున్న చురుకుదనం, అంకితభావాన్ని గుర్తించిన మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్జీ-3 ఏరియా బ్రాంచ్ సెక్రటరీగా విశేష సేవలు అందించిన ఇస్మాయిల్, మంచి కార్యకర్తగా, సమర్థ నాయకుడిగా, యూనియన్ ప్రతిష్టను పెంచే నాయకుడిగా కొనసాగుతున్నారని సహచరులు పేర్కొన్నారు. ఆయన ఎన్నిక పట్ల అధికారులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793