హెచ్.ఎం.ఎస్ జాతీయ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూమ్
శ్రీరాంపూర్: అఖిల భారత సింగరేణి మైనర్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్.ఎం.ఎస్ 26వ ద్వైపాక్షిక మహాసభలో ఆర్జీ-1 ఏరియా హెచ్.ఎం.ఎస్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్న మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూమ్, జాతీయ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.
ఖయ్యూమ్ ఎన్నిక సందర్భంగా రామగుండం రీజియన్‌తో పాటు సింగరేణి పరిధిలోని 12 డివిజన్లలో కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. యూనియన్ కార్యకలాపాల పట్ల ఆయన చూపిన చురుకుదనం, అంకితభావం, సమగ్రతను గుర్తించిన మహాసభ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
ఆర్జీ-1 ఏరియా ఉపాధ్యక్షుడిగా విశేష సేవలు అందించిన అబ్దుల్ ఖయ్యూమ్, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, సమర్థ నాయకుడిగా, యూనియన్ ప్రతిష్టను పెంచిన వ్యక్తిగా సహచరులు అభివర్ణించారు. ఆయన ఎన్నిక పట్ల అధికారులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ లకు సహకరించిన నాయకులకు, కార్మిక సోదరులకు, కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఖయ్యూమ్
Post a Comment