-->

ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఇంతియాజ్ పాషా

 ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఇంతియాజ్ పాషా ఎస్.డి

ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఇంతియాజ్ పాషా

కొత్తగూడెం: ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్‌కు చెందిన అడ్వకేట్ ఇంతియాజ్ పాషా ఎస్.డి నియమితులయ్యారు. ఈ విషయాన్ని సంస్థ అధ్యక్షుడు దిలీప్ చౌదరి తాళ్లూరి ప్రకటించారు.

ఈ నియామకంతో సంస్థ మరింత బలపడుతుందని, తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమం కోసం ఇంతియాజ్ పాషా కృషి చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే భద్రాద్రి కోతగూడెం జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలని కూడా కోరారు.

తన నియామకంపై సంతోషం వ్యక్తం చేసిన ఇంతియాజ్ పాషా ఎస్.డి మాట్లాడుతూ, తెలంగాణ న్యాయవాదుల సమస్యలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793