-->

నిజామాబాద్‌-మహారాష్ట్ర సరిహద్దులో గోదావరి ఉధృతి

నిజామాబాద్‌-మహారాష్ట్ర సరిహద్దులో గోదావరి ఉధృతి

నిజామాబాద్‌-మహారాష్ట్ర సరిహద్దులో గోదావరి ఉధృతి

నిజామాబాద్, సెప్టెంబర్ 19: గోదావరి నది వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా రెంజల్ మండలంలో అంతర్రాష్ట్ర వంతెన వద్ద భారీగా నీరు ప్రవహించడంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్ట్‌లతో పాటు, తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ జలాశయం నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

జలప్రవాహం పెరగడంతో నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని అధికారులు రైతులు, పశువుల కాపరులకు హెచ్చరికలు జారీ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793