మహిళ అసిస్టెంట్ పైలట్‌పై అత్యాచారయత్నం?
హైదరాబాద్, నవంబర్ 22: విమానయాన సంస్థలో పనిచేస్తున్న మహిళా అసిస్టెంట్ పైలట్‌పై అత్యాచారయత్నం జరిగిన సంఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బేగంపేట విమానాశ్రయంలో పైలట్‌గా పనిచేస్తున్న రోహిత్ శరణ్ (60) అనే వ్యక్తి, కంపెనీ పనుల నిమిత్తం మహిళా అసిస్టెంట్ పైలట్‌తో కలిసి బెంగళూరుకి వెళ్లాడు. ఉద్యోగ సంబంధిత పనుల తర్వాత ఇద్దరూ హోటల్ గదికి వెళ్లిన సమయంలో, రోహిత్ ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. యువతి అప్రమత్తంగా స్పందించి అక్కడినుంచి తప్పించుకుని బయటపడింది.
బెంగళూరులో జరిగిన ఈ ఘటన తరువాత ఆమె హైదరాబాద్‌కు చేరుకొని బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ప్రాంతాధికార పరిధి కారణంగా కేసును బెంగళూరులోని హలసూరు పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment