-->

ఖమ్మం నగరంలో దారుణ హత్య – భార్యను గొంతుకోసి చంపిన భర్త

ఖమ్మం నగరంలో దారుణ హత్య – భార్యను గొంతుకోసి చంపిన భర్త


ఖమ్మం నగరం : ఖమ్మం కొత్త మున్సిపాలిటీ దగ్గర, లయన్స్ క్లబ్ పక్కనున్న సందులో బుధవారం ఉదయం జరిగిన దారుణ హత్య స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భాస్కర్ తన భార్య సాయి వాణి (31)పై కత్తితో దాడి చేసి అతి క్రూరంగా గొంతు కోసి హత్య చేశాడు.

హత్యకు ముందు భాస్కర్ తన కుమార్తెపై కూడా కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా చిన్నారి చాకచక్యంగా తప్పించుకుంది. అయితే ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, మూడు చేతి వేళ్లు తెగిపోయినట్లు సమాచారం.

కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య సాగుతున్న కలహాలు ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతురాలు సాయి వాణి చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందినది.

స్థానికులు అందించిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హంతకుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793