-->

వాచ్‌మెన్ నరేష్‌ మద్యం మత్తులో అన్నం గిన్నెలో కాలు పెట్టి నిద్ర పోయిన ఘటన వెలుగు

వాచ్‌మెన్ నరేష్‌ మద్యం మత్తులో అన్నం గిన్నెలో కాలు పెట్టి నిద్ర పోయిన ఘటన వెలుగు


సంగారెడ్డి: మద్యం మత్తు ఎక్కితే మనిషి చేసే నిర్వాకం ఎక్కడికి దారి తీస్తుందో ఇటీవల జరిగిన ఒక ఘటన మరోసారి స్పష్టం చేసింది. మత్తు తలకెక్కి, కాలు అదుపు తప్పి చివరికి ఉద్యోగం ఊడిపోయిన వాచ్‌మెన్ కథ ఇప్పుడు జిల్లా మొత్తం చర్చనీయాంశమైంది.

సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్‌పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్‌లో విధులు నిర్వహిస్తున్న వాచ్‌మెన్ నరేష్‌ మద్యం మత్తులో చేసిన ఘోర ప్రేమాదం విద్యార్థులను షాక్‌కు గురిచేసింది. పూర్తిగా మత్తులో ఉన్న అతడు విద్యార్థులకు వడ్డించే అన్నం గిన్నెలో కాలు పెట్టి, ఆ గిన్నె పక్కనే నిర్లక్ష్యంగా పడుకున్నాడు. భోజనం కోసం వచ్చిన విద్యార్థులు ఈ దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.

తక్షణమే వారు ఆ దృశ్యాన్ని వీడియోగా రికార్డు చేసి కాలేజీ ఉన్నతాధికారులకు పంపించారు. వీడియోను పరిశీలించిన అధికారులు వాచ్‌మెన్ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, హాస్టల్ పరిశుభ్రతను ప్రమాదంలో పడేసిన నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల సూచనల మేరకు నరేష్‌ను వెంటనే విధుల నుండి తొలగించారు. మద్యం తాగి విధులకు హాజరవడమే తప్పు కాగా, విద్యార్థుల కోసం వండిన అన్నంలో కాలు పెట్టి పడుకోవడంపై అధికారులు మరింత సీరియస్‌గా స్పందించారు.

మత్తులో చేసిన తప్పులకు తర్వాత ఎంత పశ్చాత్తాపపడ్డా ప్రయోజనం ఉండదనడానికి ఈ ఘటన నిదర్శనం. ఉద్యోగం కోల్పోయిన నరేష్ ఇప్పుడు తీవ్ర విచారంలో ఉన్నట్లు సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793