-->

వ్యభిచార ముఠా అరెస్ట్ ఐదుగురిపై కేసు నమోదు

వ్యభిచార ముఠా అరెస్ట్ ఐదుగురిపై కేసు నమోదు


అమలాపురం నగరంలోని బ్యాంక్‌ స్ట్రీట్‌లోని పట్టాభి వీధిలో ఓ ఇంట్లో నడుస్తున్న వ్యభిచార ముఠాపై పట్టణ పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఒక మహిళతో పాటు నలుగురు విటులను అరెస్ట్‌ చేసినట్టు సీఐ పి. వీరబాబు తెలిపారు.

సుమారు 20 రోజుల క్రితం ముఠా నిర్వాహకురాలు ఈ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు దర్యాప్తులో బయటపడింది. అరెస్ట్‌ చేసిన వారిలో అమలాపురం రూరల్‌ మండలం జనుపల్లెకు చెందిన కడలి మహేష్, ముమ్మిడివరానికి చెందిన మొగలి దుర్గాప్రసాద్, అమలాపురానికి చెందిన గ్రంధి ప్రసాద్, అమలదాసు వెంకటేశ్వరరావు ఉన్నారు.

అభియోగుల నుంచి పోలీసులు రూ. 2,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకురాలు ఇద్దరు యువతులను తీసుకువచ్చి ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793