జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే పట్టం! కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం
హైదరాబాద్ : నవంబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ఖాతాలో ఘన విజయం నమోదుైంది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై పైచేయి సాధించారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగగా… చివరి వరకు అదే ఊపు నిలిచింది.
మొత్తం లెక్కింపు రౌండ్లలో ఏ దశలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలోకి రాలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి 25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో స్పష్టమైన విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.
గాంధీభవన్ వద్ద ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఈ ఫలితం ప్రజల నమ్మకం తెలిపిందని నేతలు పేర్కొన్నారు.
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పార్టీలో ఆత్మపరిశీలనకు దారి తీసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మాత్రం డిపాజిట్ కూడా కాపాడుకోలేకపోయింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు మరోసారి కాంగ్రెస్ బలం నగర రాజకీయాల్లో పెరుగుతోందని సూచిస్తున్నాయి.

Post a Comment