గణపురం మండలంలో హెచ్–58 జెన్‌కో విద్యుత్ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం
గణపురం, చెల్పూర్ –చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (KTPS) కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం–హెచ్ 58 జెన్‌కో ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు ఎలకంటి రఘోతమ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కొత్త రీజనల్ కమిటీ ఎన్నికతో పాటు స్థానిక సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
సమావేశంలో ఓ & ఎం సిబ్బంది, అర్టీజన్ కార్మికులు ఎదుర్కొంటున్న అంశాలను రాష్ట్ర కమిటీతో సమన్వయం చేస్తూ యాజమాన్యం మరియు ప్రభుత్వానికి వివరించాలనే నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.
ప్రత్యేకంగా పి.ఆర్.సి. (PRC) కమిటీని ప్రభుత్వం అత్యవసరంగా ఏర్పాటు చేయాలి, విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించేందుకు సంఘం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. అర్టీజన్ కార్మికుల సమస్యలను జెన్‌కో యాజమాన్యంతో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి హక్కులను సాధించేందుకు సంఘం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్వికెఎస్ రాష్ట్ర, రీజనల్ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment