ఇల్లందులో లంచం డిమాండ్… ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్, టెక్నికల్ అసిస్టెంట్
భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు – నవంబర్ 17: పనివేళల్లో దుకాణం మూసివేయడం, స్టాక్ కొరత వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదును తమ కార్యాలయం నుండి పంపించకుండా ఉండేందుకు రూ.30,000 లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు.
ఫిర్యాదుదారుడిపై పంపే రిపోర్టును అడ్డుకునేందుకు ఈ లంచం డబ్బు ఇల్లందు మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడు పోతు శబరీష్ ద్వారా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి వారికి పట్టుబడ్డారు.
ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు అభ్యర్థించారు. అదేవిధంగా క్రింది మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదులు పంపవచ్చని తెలిపారు—
- వాట్సాప్: 9440446106
- ఫేస్‌బుక్: Telangana ACB
- ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
- వెబ్‌సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Post a Comment