-->

అక్రమ సంబంధం ఆరోపణలపై యువకుడి దారుణ హత్య

అక్రమ సంబంధం ఆరోపణలపై యువకుడి దారుణ హత్య


వరంగల్, నవంబర్ 17: ములుగు జిల్లా లాలాయగూడెం ప్రాంతంలో అక్రమ సంబంధం అనుమానంతో జరిగిన ఘోర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక మహిళతో అనుబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలపై గ్రామస్తులు ఓ యువకుడిని సిమెంట్‌ పోలుకు కట్టేసి అమానుషంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎటునాగారం మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ జాడి సమ్మయ్య (35) స్థానికంగా ఉన్న ఒక వివాహిత మహిళతో పరిచయం కొనసాగిస్తున్నాడనే అనుమానం కుటుంబ సభ్యుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో వారిద్దరిని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులై సమ్మయ్యను బలవంతంగా లాలాయగూడెం గ్రామ శివారులోని సిమెంట్ పోలుకు కట్టేసి దారుణంగా అడ్డదిడ్డంగా కొట్టినట్లు సమాచారం.

తీవ్ర గాయాలతో సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ములుగు జిల్లా లాలాయగూడెం గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులే ఈ దాడి చేపట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. మృతుడిని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793