బీసీ రిజర్వేషన్ల కోసం ఉధృతమైన ఉద్యమం
కేంద్రం దిగి రావాల్సిందే… అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో గురువారం జరిగిన బీసీ ధర్మ పోరాట దీక్షలో పలువురు ప్రముఖులు పాల్గొని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో “రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే బిక్ష కాదు… మా రాజ్యాంగ హక్కు” అని బీసీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రాన్ని ఒత్తిడికి గురి చేయాలని ఆవశ్యకత వ్యక్తం చేశారు.
“బీసీలను నమ్మించి మోసం చేస్తే తిరుగుబాటే” – బీసీ జేఏసీ హెచ్చరిక
ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, ప్రొ. కోదండరాం, అద్దంకి దయాకర్, మధుసూదనాచారి, ఎల్. రమణ, మధు యాష్కీ, ఇతర బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు.
“రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు ప్రత్యేక వాటా ఇవ్వాలి” – దత్తాత్రేయ
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ:
- బీసీల 42% రిజర్వేషన్ డిమాండ్ న్యాయసమ్మతమే
- బీసీలకు హక్కుగా రావాల్సిన వాటా అందితేనే ప్రజాస్వామ్యంలో సమానత్వం ఉంటుందని
- ఈ విషయమై ప్రధాని మోదీతో మాట్లాడతానని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు ప్రత్యేక శాతం కేటాయించాలని కూడా సూచించారు.
పరిష్కారం కేంద్ర బాధ్యత: కోదండరాం
“కేంద్రం రిజర్వేషన్ల బిల్లు ఆమోదించకుండా అడ్డు పడుతోంది” – మధు యాష్కీ
“బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి… లేనిపక్షంలో రాష్ట్రం అగ్నిగుండం”
జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ:
- 42% రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు
- గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీలు పోరాడతారు
- స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు లేకుంటే రాష్ట్రం అశాంతికి గురవుతుందని హెచ్చరించారు.
రాజకీయాలకతీతంగా బీసీ ఉద్యమం కొనసాగింపు
జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ మాట్లాడుతూ:
- కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో బీసీ రిజర్వేషన్ల అమలుకు ముందుకు రావాలని
- ఒక్క అడుగు వెనక్కి లేకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఈ దీక్షలో కుల్కచర్ల శ్రీనివాస్, కనకాల శ్యాంకర్, ప్రొ. బాగయ్య, మనీ మంజరి సాగర్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment