సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆంక్ష రెడ్డి బాధ్యతల స్వీకరణపై సన్మానాలు
సిద్దిపేట జిల్లా, నవంబర్ 23: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదివారం ఉదయం గజ్వేల్‌లోని ఆమె నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
నాచారం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త, తూప్రాన్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, తూప్రాన్ మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నల్లవల్లి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ తదితరులు ఆంక్ష రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా రవీందర్ గుప్త మాట్లాడుతూ,
“సిద్దిపేట జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా ఆంక్ష రెడ్డి గారి నాయకత్వం కొత్త ఊపును తీసుకువస్తుంది. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కాంగ్రెస్ విజయం కోసం ఆమె అహర్నిశలు కృషి చేస్తారని మేము విశ్వసిస్తున్నాం” అని పేర్కొన్నారు. నాయకులు ఆంక్ష రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

Post a Comment