-->

ఆదర్శ పొరుగు – ఆదర్శ సమాజం దేశవ్యాప్తంగా జమాతే ఇస్లామి హింద్ పది రోజుల ఉద్యమం ప్రారంభం

ఆదర్శ పొరుగు – ఆదర్శ సమాజం దేశవ్యాప్తంగా జమాతే ఇస్లామి హింద్ పది రోజుల ఉద్యమం ప్రారంభం


రుద్రంపూర్/రామవరం: సమాజంలో సఖ్యత, సత్సంబంధాలు, మానవతా విలువలను పెంపొందించేందుకు జమాతే ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా పది రోజుల పాటు ‘ఆదర్శ పొరుగు – ఆదర్శ సమాజం’ పేరుతో ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించింది. మన చుట్టూ ఉన్న వారితో మంచితనంతో వ్యవహరించడం, అదే నిజమైన దైవభక్తి అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి చాటిచెప్పాలని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా రుద్రంపూర్, రామవరం జమాత్ అధ్యక్షుడు అబ్దుల్ మాజిద్ రబ్బానీ, సభ్యులు అబ్దుల్ బాసిత్, రహ్మతుల్లాహ్ హుస్సేనీ, అజ్మత్, మదార్ తదితరులు మాట్లాడుతూ—

  • మానవులందరి సృష్టికర్త ఒక్కరేనని, అందరూ ఆయన దాసులేనని,
  • సమాజంలో ఏ వ్యక్తికీ కష్టం, నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని,
  • ఖురాన్ బోధనల ద్వారా మానవుల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడమే ఉద్యమం లక్ష్యమని చెప్పారు.

కులమతాలకు అతీతంగా ఒకరి పండుగలు, పర్వదినాలను మరొకరు గౌరవించుకోవడం, పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవడం ద్వారా సమాజంలో శాంతి, సౌహార్ద వాతావరణాన్ని నెలకొల్పడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమాత్ సభ్యులతో పాటు వివిధ పత్రికల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793