-->

మేడారం జాతర బందోబస్త్ కోసం సిబ్బందికి పూర్తి స్థాయి వసతులు కల్పించాలి

మేడారం జాతర బందోబస్త్ కోసం సిబ్బందికి పూర్తి స్థాయి వసతులు కల్పించాలి: జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపీఎస్


ములుగు: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా బందోబస్త్‌లో పాల్గొనబోయే అధికారులు, పోలీసు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపీఎస్ ఆదేశించారు.

ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ గారు మంగళవారం వెంగలాపూర్ నుండి బయ్యక్కపేట వరకు, అలాగే మేడారం జాతర కోసం సిబ్బంది వసతుల కోసం కేటాయించిన ప్రదేశాలను ప్రత్యక్షంగా సందర్శించారు. ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలిస్తూ, సిబ్బంది కోసం తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.

"బందోబస్త్ కోసం వచ్చే సిబ్బంది సౌకర్యవంతమైన వసతులు కలిగి ఉంటే వారు మరింత నిబద్ధతతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారు. అందువల్ల జాతర ప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తి చేయాలి" అని ఎస్పీ ఆదేశించారు.

తదనంతరం, మేడారం లో జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులు, గుడి పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లు కూడా ఎస్పీ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఓఎస్డీ శివం ఉపాధ్యాయ్, ఐపీఎస్, ములుగు డీఎస్పీ రవీందర్, పసర సీఐ దయాకర్, ఆర్‌ఐలు స్వామి, వెంకటనారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793