ఏడేళ్ల బాలిక హత్య–లైంగికదాడి కేసు : పెదనాన్న వరుసకు వ్యక్తే నిందితుడు
మంచిర్యాల జిల్లా, దండెపల్లి మండలం – డిసెంబర్ 03: ఏడేళ్ల నిరపరాధ చిన్నారి మహన్విత హత్య కేసు మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని రేపింది. వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి చిన్నారిని అపహరించి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అపహరణ నుండి హత్య వరకు : పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ నిజాలు
డిసెంబర్ 24న నంబాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న మహన్వితను శనిగారపు బాపు అనే వ్యక్తి అపహరించాడు. అతనితో తరచూ తిరిగే ఉపారపు సతీష్ కూడా ఈ నేరంలో తోడ్పడ్డాడు.
చీకటి పడిన సమయాన్ని గమనించిన ఇద్దరు దుండగులు చిన్నారిని సమీపంలోని పత్తి పొలాల్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. విషయం బయటపడుతుందన్న భయంతో బాలికను శ్వాస ఆడకుండా చేసి హత్య చేసి, శవానికి బండరాయి కట్టి గ్రామానికి 100 మీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేశారు.
మూడ్రోజుల గాలింపు… బావిలో కనిపించిన శవం
టెక్నికల్ సాక్ష్యాలతో కేసు ఛేదన
పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు. మొబైల్ టవర్ లొకేషన్లు, దర్యాప్తులో సేకరించిన ఆధారాలు ఈ ఇద్దరి ప్రమేయాన్ని నిర్ధారించాయి.
నిందితులు:
- శనిగారపు బాపు అలియాస్ కట్టెల బాపు
- ఉపారపు సతీష్
పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
గ్రామంలో ఉద్రిక్తత – నిందితులకు కఠిన శిక్ష డిమాండ్
చిన్నారి మృతదేహం బయటపడిన తరువాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను గ్రామస్తులు కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. రేపటి రోజు తమ పిల్లలకు ఇటువంటి ప్రమాదం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
“ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు లేఖ” – పోలీసుల హామీ
ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగంగా విచారణ జరిపి నిందితులకు గరిష్ట శిక్ష వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Post a Comment