-->

బంజారాహిల్స్‌లో చీరల షాప్‌లో మహిళలపై నిర్వాకం ఆరోపణలు

బంజారాహిల్స్‌లో చీరల షాప్‌లో మహిళలపై నిర్వాకం ఆరోపణలు


హైదరాబాద్, బంజారాహిల్స్: ప్రముఖ చీరల షాప్ ‘ఫ్రంటియర్ రాస్’ లో ఇద్దరు మహిళలపై స్టాఫ్ అసభ్య ప్రవర్తన చేసినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. చీరలు కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళలకు సారీ డ్రేపింగ్ పేరుతో సిబ్బంది సభ్యుడు స్వామి అనుచితంగా ప్రవర్తించినట్టు బాధితులు తెలిపారు.

సారీ ట్రయల్ సమయంలో ఆ ఉద్యోగి పలుమార్లు తమ శరీర భాగాలను తాకాడని, ఇది ఇబ్బందికరంగా అనిపించడంతో వెంటనే స్టాఫ్ మేనేజర్‌కి ఫిర్యాదు చేసినట్టు మహిళలు చెప్పారు.
గత రెండు రోజుల్లో రెండు భిన్న ఘటనల్లో ఇదే ఉద్యోగి ఇలాంటి ప్రవర్తన చూపినట్టు ఆరోపణలు ఉన్నాయి.

దుకాణంలోని సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయని మహిళలు పేర్కొన్నప్పటికీ, తాము పోలీసులకు చేరుకునేలోపే ఫుటేజ్‌ను డిలీట్ చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793