సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మృతి
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్ (N) గ్రామ సర్పంచ్‌గా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన అక్కమ్మ (58) అనారోగ్యంతో మృతి చెందారు. సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కేవలం రెండు రోజులకే ఆమె కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కమ్మ 141 ఓట్ల మెజారిటీతో BRS మద్దతు ఉన్న అభ్యర్థిని ఓడించి ఘన విజయం సాధించారు. గ్రామాభివృద్ధికి పలు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని భావించిన సమయంలోనే ఆమె ఆకస్మిక మృతి చెందడం స్థానికుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఆమె మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు. గ్రామానికి సేవ చేయాలన్న ఆశతో ప్రజల తీర్పు అందుకున్న సర్పంచ్ ఇలా అకాలంగా కన్నుమూయడం బాధాకరమని వారు పేర్కొన్నారు.

Post a Comment