రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన బ్రహ్మానందం
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఆయన రాష్ట్రపతిని శాలువతో సత్కరించి తన అభిమానాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహుకరించడం విశేషంగా నిలిచింది. బ్రహ్మానందం కళాత్మక ప్రతిభకు ఇది మరో నిదర్శనంగా అభిమానులు పేర్కొంటున్నారు.
రాష్ట్రపతిని కలసి గౌరవించడం పట్ల బ్రహ్మానందం అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీ టాలీవుడ్ వర్గాల్లో విశేష చర్చకు దారి తీసింది.

Post a Comment