-->

మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం డిసెంబర్ 22: శాస్త్రాలకు మార్గదర్శిగా నిలిచే గణిత శాస్త్రం ప్రగతికి సోపానమని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మనిషి జీవితానికి గణిత శాస్త్రానికి విడదీయరాని సంబంధం ఉందని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ సేవలను స్మరించుకుంటూ, గణితాన్ని మానవాళికి మరింత ఉపయోగకరంగా మార్చే దిశగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. గణితంపై పట్టు సాధిస్తే మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపగలరని తెలిపారు. అర్థమైతే గణిత శాస్త్రం కన్నా సులభమైన సబ్జెక్టు మరొకటి లేదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు గణిత శాస్త్రంపై నిర్వహించిన వివిధ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. రామానుజన్ జీవిత విశేషాలు, ఆయన గణిత రంగానికి చేసిన సేవలను విద్యార్థులు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పర్వీన్ సుల్తానా, గణిత ఉపాధ్యాయురాళ్లు నాజియా సుల్తాన, నస్రత్, శీరిషా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793